ఏపీ కేబినెట్ నిర్ణయాలు..‘అగ్రిగోల్డ్’ బాధితుల కోసం రూ.1150 కోట్లు కేటాయింపు
- రూ.20 వేల లోపు డిపాజిట్ దారులకు తక్షణం లబ్ధి
- ప్రభుత్వ పథకాలను గ్రామ వాలంటీర్ల ద్వారా చేరవేస్తాం
- ప్రతి 50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటీర్: మంత్రి పేర్ని నాని
రూ.2 వేల కోట్లతో ప్రకృతి వైపరీత్యాల సహాయ నిధి, రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయాలని, రైతులకు ఉచిత బోర్లు వేసేందుకు ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున మొత్తం 200 రిగ్గులు అందుబాటులో ఉంచాలని నిర్ణయించినట్టు చెప్పారు. పండించిన పంటకు కనీస మద్దతు ధర కల్పించేందుకు ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేసే ఏర్పాటు చేయాలని, పంటల బీమాకు సంబంధించిన ప్రీమియం ప్రభుత్వమే చెల్లించాలని, ఏదైనా పంటకు నష్టం జరిగితే ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నట్టు నాని వివరించారు.