రోజాకు ఆర్టీసీ చైర్మన్ పదవి?
- రోజా లేకుండానే జగన్ క్యాబినెట్
- అందుబాటులో లేకుండా పోయిన రోజా!
- విజయసాయిరెడ్డి మంతనాలు!
ఆర్టీసీ చైర్మన్ పదవికి నామినేట్ చేస్తామని ఆయన చెప్పగా, రోజా సంతృప్తి చెందినట్టు వినికిడి. అయితే, ఆమె ఎమ్మెల్యేగా విజయం సాధించిన నేపథ్యంలో, గెలిచిన అభ్యర్థులు ఇలాంటి నామినేటెడ్ పదవులు చేపట్టడంలో రాజ్యాంగపరమైన అడ్డంకులను వైసీపీ అధినాయకత్వం పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు, మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవి కూడా రోజా ముందు ఓ ఆప్షన్ లా ఉంచారని ప్రచారం జరుగుతోంది. మరి రోజా భవితవ్యం ఏ పదవితో ముడిపడి ఉందో కాలమే చెప్పాలి!