ఎన్ని మందులు వాడినా గజ్జి తగ్గలేదంటూ డాక్టర్ భార్యను హత్యచేసిన వ్యక్తి

07-06-2019 Fri 19:00 | National
  • మధ్యప్రదేశ్ లో దారుణం
  • డాక్టర్ పై కోపంతో విచక్షణ మరిచిన రోగి
  • డాక్టర్ భార్య మృతి, కొడుకు పరిస్థితి విషమం
మధ్యప్రదేశ్ లో అత్యంత దారుణమైన ఘటన జరిగింది. రఫీక్ అనే వ్యక్తి కొంతకాలంగా చర్మవ్యాధితో బాధపడుతున్నాడు. అయితే, ఎన్ని మందులు వాడినా గజ్జి తగ్గలేదంటూ తనకు వైద్యం చేసిన డాక్టర్ భార్యను చంపేశాడు. ఇండోర్ కు చెందిన రఫీక్ కొన్నాళ్లుగా డాక్టర్ రామకృష్ణ వర్మ అనే స్కిన్ స్పెషలిస్ట్ వద్ద చికిత్స పొందుతున్నాడు. గత ఆరు నెలలుగా మందులు వాడుతున్నా పరిస్థితిలో మార్పు కనిపించలేదు. పైగా జబ్బు మరింత ఎక్కువైంది.

దాంతో, ఇదేంటని ప్రశ్నించేందుకు ఆగ్రహంతో ఆసుపత్రి వద్దకు వెళ్లాడు. అయితే, ఆ సమయంలో డాక్టర్ లేకపోవడంతో, ఆయన భార్యను ప్రశ్నించాడు. తన భర్త ఢిల్లీ వెళ్లాడని ఆమె చెప్పింది. కానీ, అప్పటికే పట్టలేని ఆవేశంతో ఉన్న రఫీక్ డాక్టర్ లేకపోవడంతో మరింత ఉద్రేకానికి లోనయ్యాడు. వెంటనే తన వద్ద ఉన్న కత్తితో డాక్టర్ భార్యను పొడిచాడు. ఆమె అరుపులు విని కొడుకు అభిషేక్ అక్కడికి రావడంతో రఫీక్ ఆ యువకుడ్ని కూడా కత్తితో పొడిచాడు.

అంతలో స్థానికులు వచ్చి రఫీక్ ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. తీవ్రగాయాలపాలైన డాక్టర్ భార్యను ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. అప్పటికే ఆమె చనిపోయినట్టు డాక్టర్లు చెప్పారు. అటు, 19 ఏళ్ల ఆమె కుమారుడి పరిస్థితి కూడా ఏమీ చెప్పలేమని డాక్టర్లు అంటున్నారు. కాగా, నిందితుడు పాత నేరస్తుడు అని పోలీసులు చెబుతున్నారు. రఫీక్ పై ఇప్పటికే ఓ హత్యకేసు నమోదైందట!
Madhya Pradesh

More Telugu News

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51
..more