జగన్ మంత్రి పదవి ఇచ్చినా, ఇవ్వకపోయినా పార్టీకి విధేయుడిగా ఉంటా!: తమ్మినేని సీతారాం
- నాకు పార్టీయే ముఖ్యం.. పదవులు కాదు
- మంత్రి పదవి విషయంలో జగన్ దే తుదినిర్ణయం
- శ్రీకాకుళంలో మీడియాతో వైసీపీ నేత
పరిపాలన విషయంలో జగన్ ట్రెండ్ సృష్టిస్తారని తమ్మినేని సీతారాం విశ్వాసం వ్యక్తం చేశారు. తన నియోజకవర్గమైన ఆముదాలవలసలో షుగర్ ఫ్యాక్టరీని తెరిపించడంతో పాటు నియోజకవర్గంలో ఉన్న అన్ని సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. గత ఐదేళ్లలో నియోజకవర్గంలో భారీ అవినీతి చోటుచేసుకుందన్న సీతారాం.. వీటన్నింటిపై విచారణ జరిపిస్తామని ప్రకటించారు.