తెలుగులో కీర్తి సురేశ్ కి మరో ఛాన్స్
Add ap7am to your home Screen

తెలుగులో కీర్తి సురేశ్ కి మరో ఛాన్స్

  • నితిన్ హీరోగా రూపొందనున్న 'భీష్మ'
  • తదుపరి సినిమా వెంకీ అట్లూరితో
  • ప్రేమకథా నేపథ్యంలో సాగే కథ 
తెలుగులో 'మహానటి' తరువాత కీర్తి సురేశ్ దూకుడు ఒక రేంజ్ లో ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ స్టార్ హీరోల సినిమాల నుంచి ఆమెకి అవకాశాలు రాలేదు. దాంతో నాయిక ప్రాధాన్యత కలిగిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి, ఆ ప్రాజెక్టు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె మరో లవ్ స్టోరీకి ఓకే చెప్పేసినట్టుగా సమాచారం.

నితిన్ కథానాయకుడిగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఒక సినిమా రూపొందనుంది. ఈ సినిమాలో కథానాయికగా కీర్తి సురేశ్ ను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మితం కానుంది. వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ 'భీష్మ' షూటింగ్ ముందుగా మొదలై డిసెంబర్ 20వ తేదీన విడుదలవుతుంది. ఆ తరువాత వెంకీ అట్లూరి .. నితిన్ .. కీర్తి సురేశ్ ప్రాజెక్టు పట్టాలెక్కుతుంది. 
nithin
keerthi suresh

More Telugu News