జగన్ హుందాగా పిలిస్తే అనని మాటలను పుట్టిస్తావా? నువ్వు మారవు చంద్రబాబు!: విజయసాయిరెడ్డి
- జగన్ ఆహ్వానానికి బాబు వేరే స్టోరీ అల్లారు
- మీ సలహాలు అవసరం. మీరు అనుభవజ్ఞులు అని చెప్పినట్లు రాశారు
- ట్విట్టర్ లో మండిపడ్డ వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి
చంద్రబాబు అనుభవం రాష్ట్రాన్ని దోచుకోవడానికి మాత్రమే ఉపయోగపడిందని ఎద్దేవా చేశారు. ఇది గమనించిన ఏపీ ప్రజలు యువనేత జగన్ కు పట్టం కట్టారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు జీవితంలో ఎప్పుడూ మారడని స్పష్టం చేశారు.
ఈరోజు విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో స్పందిస్తూ..‘ప్రమాణ స్వీకారానికి జగన్ గారు హుందాగా ఆహ్వానిస్తే దానికి వేరే స్టోరీ అల్లి మీడియాలో రాయించుకుంటావా? మీ సలహాలు అవసరం, మీరు అనుభవజ్ఞులు అని, ఆయన అనని మాటలు పుట్టిస్తారా? మీ అనుభవం దోచుకోవడానికి మాత్రమే ఉపయోగించావని గ్రహించే యువనేతకు పట్టం కట్టారు ప్రజలు. నువ్వు మారవు బాబూ’ అని విమర్శించారు.