ఉగ్రవాదుల వేషాల్లో జూనియర్ ఆర్టిస్టులు.. బెంబేలెత్తిన జనం.. ఆగిపోయిన హృతిక్ రోషన్ సినిమా!
Add ap7am to your home Screen

ఉగ్రవాదుల వేషాల్లో జూనియర్ ఆర్టిస్టులు.. బెంబేలెత్తిన జనం.. ఆగిపోయిన హృతిక్ రోషన్ సినిమా!

  • నిజమైన ఉగ్రవాదులని భయపడ్డ ప్రజలు
  • పట్టుకుని స్టేషన్ కు తరలించిన పోలీసులు
  • నిర్మాతలు సాక్ష్యాలు సమర్పించడంతో విడుదల
పరిస్థితులు బాగోలేప్పుడు మన జాగ్రత్తల్లో మనం ఉండాలి. లేదంటే అనవసరంగా చాలా ఇబ్బందుల్లో చిక్కుకోవాల్సి వస్తుంది. తాజాగా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో అలాంటి ఘటనే చోటుచేసుకుంది. బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ ప్రస్తుతం మరో నటుడు టైగర్ ష్రాఫ్ తో కలిసి ఓ యాక్షన్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగును ముంబైలో నిర్వహిస్తున్నారు. అయితే సినిమాలో ఉగ్రవాదులుగా నటిస్తున్న ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులకు షూటింగ్ సందర్భంగా ఈరోజు బ్రేక్ లభించింది.

దీంతో వేసుకున్న డ్రస్సులు తీయకుండానే వీరు ఓ షాపుకు వెళ్లారు. దీంతో అటుగా వెళుతున్న ప్రజలు బెంబేలెత్తి పోయారు. వీరిని గమనించిన షాపు యజమాని పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే ఘటనాస్థలికి భారీ సంఖ్యలో చేరుకున్న పోలీసులు వీరిద్దరికీ బేడీలు వేసి స్టేషన్ కు తరలించారు. ‘మేము జూనియర్ ఆర్టిస్టులం మొర్రో’ అని చెప్పినా పోలీసులు వినిపించుకోలేదు. ఈ విషయం తెలుసుకున్న సినిమా నిర్మాతలు సాక్ష్యాలను తీసుకుని వెళ్లడంతో ఇద్దరు ఆర్టిస్టులను పోలీసులు విడిచిపెట్టారు. ఈ వ్యవహారంతో సినిమా షూటింగ్ ను తాత్కాలికంగా ఆపేశారు. కాగా, ఈ సినిమాను సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తున్నారు.
terrorists
mumbai
hrutik roshan
Bollywood
tigor shrrief

More Telugu News