అభిమానులతో హీరో సూర్య ముచ్చటిస్తుంటే... మధ్యలో స్వీట్ షాకిచ్చిన క్రికెటర్ సురేశ్ రైనా!
- 'ఎన్.జీ.కే' ప్రమోషన్ లో బిజీగా సూర్య
- ట్విట్టర్ ద్వారా అభిమానుల ప్రశ్నలకు సమాధానం
- మధ్యలో వచ్చి సూపర్ కింగ్స్ పై ప్రశ్నించిన రైనా
- నమ్మలేకున్నానంటూనే సమాధానం చెప్పిన సూర్య
అయితే, ప్రశ్నకు సమాధానం చెప్పే విషయాన్ని పక్కనబెడితే, రైనా అలా ట్విట్టర్ లోకి రావడాన్ని తొలుత నమ్మలేకపోయిన సూర్య, ఆపై జవాబు చెప్పాడు. "మీకు నాతో మాట్లాడటానికి సమయం దొరికిందా? నేను నమ్మలేకున్నాను. మీ పాప గ్రేసియాతో పాటు అందరినీ అడిగానని చెప్పండి. చెన్నై సూపర్ కింగ్స్ లో నాకు ధోని అంటే ఇష్టం. నేనేమీ కావాలని చెప్పడం లేదు. నేను ఎప్పటికీ సూపర్ కింగ్స్ ఫ్యాన్ నే. జట్టులో నేను కలిసిన తొలి ఆటగాడు ధోని. ఆ సమయంలో మీరు నాకు హలో చెప్పారు. మనం కలిసి దిగిన ఫోటోను నేను భద్రంగా దాచుకున్నాను" అని సూర్య చెప్పుకొచ్చాడు.