ఎన్ సీఎల్ఏటీలో హీరో శివాజీకి ఎదురుదెబ్బ
Add ap7am to your home Screen

ఎన్ సీఎల్ఏటీలో హీరో శివాజీకి ఎదురుదెబ్బ

  • రవిప్రకాశ్ తనను మోసం చేశారన్న శివాజీ
  • పిటిషన్ పై విచారణ జరపలేమన్న అప్పిలేట్ ట్రైబ్యునల్
  • తదుపరి విచారణ జూలై 12కి వాయిదా
టీవీ9 చానల్ మాతృసంస్థ ఏబీసీఎల్ బోర్డులో మార్పులపై స్టే విధించాలని, యథాతథ స్థితిని కొనసాగించాలని కోరుతూ హీరో శివాజీ వేసిన పిటిషన్ పై జూలై 12 వరకు విచారణ జరపలేమంటూ ఢిల్లీలోని నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రైబ్యునల్ స్పష్టం చేసింది. ఏబీసీఎల్ బోర్డులో జరిగిన మార్పులు, చేర్పులను తన దాకా రానివ్వకుండా రవిప్రకాశ్ మోసం చేశారంటూ శివాజీ తన పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే ఇప్పటికే ఈ వ్యవహారంలో జూలై 9వరకు స్టే ఉన్నందున ప్రొసీడింగ్స్ జరపలేమంటూ, అప్పిలేట్ ట్రైబ్యునల్ తదుపరి విచారణను జూలై 12కి వాయిదా వేసింది.
TV9
Sivaji

More Telugu News