మహేశ్ బాబు టైటిల్ సెంటిమెంట్ గురించే అనిల్ రావిపూడి ఆలోచన
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మహేశ్ బాబు టైటిల్ సెంటిమెంట్ గురించే అనిల్ రావిపూడి ఆలోచన

  • సక్సెస్ ను సాధించిన 'మహర్షి'
  • తదుపరి సినిమాకి సన్నాహాలు
  • టైటిల్ పై అనిల్ రావిపూడి కసరత్తు
మహేశ్ బాబు తాజా చిత్రంగా థియేటర్లకు వచ్చిన 'మహర్షి' భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోన్న మహేశ్ బాబు .. తన తదుపరి ప్రాజెక్టుపై దృష్టిపెట్టాడు. ఆయన తదుపరి సినిమా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఉండనుంది. పూర్తి వినోదభరితమైన కథాకథనాలతో ఈ సినిమా నడుస్తుందని అంటున్నారు. ఈ సినిమాకి 'సరిలేరు నీకెవ్వరూ' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ టైటిల్ ఖరారు కాకపోవచ్చనే టాక్ బలంగా వినిపిస్తోంది.  

మహేశ్ బాబుకి టైటిల్ సెంటిమెంట్ వుంది. 'మురారి' .. 'పోకిరి' .. 'ఒక్కడు' .. 'దూకుడు' .. ఇలా మూడు అక్షరాలతో వచ్చిన ఆయన సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. తాజాగా మూడు అక్షరాలతో వచ్చిన 'మహర్షి' హిట్ టాక్ తెచ్చుకుంది. అందువలన తదుపరి సినిమా టైటిల్ కూడా మూడు అక్షరాలతో ఉండేలా చూడమని మహేశ్ బాబు .. అనిల్ రావిపూడితో అన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం టైటిల్ విషయంలోనే ఆయన కసరత్తు చేస్తున్నట్టుగా సమాచారం.
Mahesh Babu

More Telugu News