గెలిచే సీన్ ఉంటే నాలుగు రకాల సర్వేలెందుకు?: చంద్రబాబుకు విజయసాయి సూటి ప్రశ్న
Add ap7am to your home Screen

గెలిచే సీన్ ఉంటే నాలుగు రకాల సర్వేలెందుకు?: చంద్రబాబుకు విజయసాయి సూటి ప్రశ్న

  • నాలుగు సర్వేలూ టీడీపీకే అనుకూలమంటున్న చంద్రబాబు
  • ఆ వివరాలను బయట పెట్టలేదని విజయసాయి ఎద్దేవా
  • ట్విట్టర్ లో స్పందించిన వైసీపీ ఎంపీ
తెలుగుదేశం పార్టీ నిజంగా గెలుస్తుందని చంద్రబాబునాయుడు భావిస్తే, నాలుగు రకాల సర్వేలను ఎందుకు చేయించాల్సి వచ్చిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. కనీసం ఈ సర్వేల వివరాలను కూడా ఆయన బయటపెట్టలేదని ఎద్దేవా చేశారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఈ ఉదయం విజయసాయి ఓ ట్వీట్ పెట్టారు.

"గెలిచే సీన్ ఉంటే నాలుగు రకాల సర్వేలెందుకు చేయించారు చంద్రబాబూ? ఆ సర్వే వివరాలు బయటపెట్టి కనీసం కౌంటింగ్ ఏజెంట్లకైనా ధైర్యం నూరిపోయండి. ఎన్నికలు ఐదేళ్లకోసారొస్తాయి. పార్టీ శాశ్వతం. మేలో రావాల్సిన ఎన్నికలను ముందే జరిపి ఇబ్బంది పెట్టాలని చూశారు లాంటి శోకాలెందుకు?" అని అన్నారు. కాగా, ఇటీవల పలుమార్లు చంద్రబాబునాయుడు టీడీపీ నేతలు, కార్యకర్తలతో మాట్లాడుతూ, తాను నాలుగు రకాల సర్వేలను చేయించానని, అన్నింటిలో టీడీపీ విజయం ఖాయమని తేలిందని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.



Vijay Sai Reddy
Chandrababu
Twitter

More Telugu News