నేడు, రేపు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశం!
- అరేబియా సముద్రం నుంచి తేమగాలులు
- పిడుగులతో కూడిన వడగళ్ల వానలకు చాన్స్
- హెచ్చరించిన వాతావరణ శాఖ
మైదాన ప్రాంతాల్లో ఈ వర్షాలు అధికంగా కురుస్తాయని అన్నారు. కాగా, ఆదివారం నాడు పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. హైదరాబాద్ లోని పలు ప్రాంతాలను చిరు జల్లులు పలకరించగా, ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్, ఆదిలాబాద్ జిల్లాలతో పాటు కర్నూలు, కృష్ణా జిల్లాల్లోని కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు కురిశాయి.