నా హృదయం లోతుల్లోంచి మీకు కృతజ్ఞతలు చెబుతున్నా: మహేశ్ బాబు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నా హృదయం లోతుల్లోంచి మీకు కృతజ్ఞతలు చెబుతున్నా: మహేశ్ బాబు

  • మహర్షి చిత్రాన్ని విజయవంతం చేశారంటూ ట్వీ
  • అభిమానులకు, ప్రేక్షకులకు ధన్యవాదాలు
  • తన పాతిక సినిమాల ప్రస్థానం చాలా ప్రత్యేకం అంటూ ఆనందం
టాలీవుడ్ అగ్రహీరో మహేశ్ బాబు మహర్షి చిత్ర విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. గురువారం విడుదలైన ఈ చిత్రానికి అన్ని సెంటర్ల నుంచి సానుకూల స్పందన కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే చిత్రబృందం సక్సెస్ మీట్ కూడా నిర్వహించింది. తాజాగా, మహేశ్ బాబు తన ఆనందాన్ని ట్విట్టర్ ద్వారా వ్యక్తం చేశారు.

ఇంతటి ఘనవిజయం అందించినందుకు అద్భుతమైన మహర్షి టీమ్ మెంబర్స్ కు, దర్శకుడు వంశీ పైడిపల్లికి, ప్రతి ఒక్కరికి తన హృదయం లోతుల్లోంచి ధన్యవాదాలు చెబుతున్నట్టు పేర్కొన్నారు. ఇప్పటివరకు తన ప్రస్థానం ఎంతో ప్రత్యేకంగా సాగిందని, తన 25వ చిత్రాన్ని భారీ హిట్ గా మలిచినందుకు అందరికీ కృతజ్ఞతలు అంటూ ట్వీట్ చేశారు. ముఖ్యంగా, మహర్షి చిత్రం పట్ల విశేష స్పందన చూపిస్తున్న అభిమానులకు, ప్రేక్షకులకు కృతజ్ఞతలు అంటూ వ్యాఖ్యానించారు.
Mahesh Babu
Maharshi

More Telugu News