టీవీ9 రవిప్రకాశ్ భార్య, హీరో శివాజీలకు నోటీసులు అందించిన పోలీసులు
- రవి ప్రకాశ్ పై ఫోర్జరీ కేసు నమోదు
- రేపు పోలీసుల ఎదుట హాజరు కావాలని నోటీసులు
- టీవీ9 కార్యాలయంలో 12 హార్డ్ డిస్కుల స్వాధీనం
మరోవైపు, ఇదే కేసుకు సంబంధించి హీరో శివాజీకి కూడా నోటీసులు ఇచ్చారు. రేపు పోలీసుల ఎదుట హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. ఏడు బృందాలుగా విడిపోయిన సైబర్ క్రైమ్ పోలీసులు సోదాలు జరుపుతున్నారు. టీవీ9 కార్యాలయంలో 12 హార్డ్ డిస్కులను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఈ అంశానికి సంబంధించి ఈ సాయంత్రం పోలీసు అధికారులు ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.