బ్యాడ్ న్యూస్ అని చెప్పగానే మహేశ్ బాబు కంగారుపడిపోయారు: 'పీవీపీ' అధినేత వరప్రసాద్
- వారం కిందటే మహర్షి చిత్రాన్ని చూశాను
- ఇలాంటి హిట్ మీరు కొట్టలేరండీ ఇదే మీకు బ్యాడ్ న్యూస్ అన్నాను
- మహేశ్ బాబు కెరీర్లో ఇంతకంటే ముచ్చటైన చిత్రం మరొకటి ఉండదు
బ్యాడ్ న్యూస్ అంటున్నారేంటి? అంటూ మహేశ్ బాబు ఒకింత ఆందోళనగానే అడిగారని, అందుకు తాను బదులిస్తూ, ఈ సినిమాను మించిన హిట్ మీరు ఎప్పటికీ కొట్టలేరు, అదే మీకు బ్యాడ్ న్యూస్ అని చెప్పానని పీవీపీ వివరించారు. మీ కెరీర్ లో తిరుగులేని బ్లాక్ బస్టర్, ఇది గుడ్ న్యూస్ అనేసరికి ఆయన రిలీఫ్ గా ఫీలయ్యారని పీవీపీ చెప్పారు.
కాగా, ఈ సినిమా స్టోరీలైన్ ను మూడేళ్ల కిందటే దర్శకుడు వంశీ పైడిపల్లితో మహేశ్ బాబుకు చెప్పించానని, కథ నచ్చడంతో తనతోపాటు దిల్ రాజు, అశ్వనీదత్ కూడా ప్రొడ్యూసర్లుగా చేయి కలిపారని పీవీపీ వెల్లడించారు. మహేశ్ బాబు కెరీర్లో ఇంతకంటే ముచ్చటైన చిత్రం మరొకటి ఉండదని అన్నారు.