ఈసీ ఆమోదించాకే కేబినెట్ భేటీ ఉంటుంది: సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం
- అధికారులతో సీఎస్ సమాలోచన
- కేబినెట్ అజెండాను స్క్రీనింగ్ చేసి ఈసీకి పంపుతాం
- అజెండా పరిశీలనకు కనీసం 48 గంటల సమయం పడుతుంది
కేబినెట్ భేటీలో ఏ అంశాలపై నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారో చెప్పాలని కోరానని, ఈసీ నిబంధనలను సీఎం చంద్రబాబుకు వివరించాలని సూచించినట్టు ఎల్వీ సుబ్రహ్మణ్యం తెలిపారు. కేబినెట్ అజెండాను స్క్రీనింగ్ చేసి ఈసీకి పంపుతామని, ఈ అజెండాను ఈసీ ఆమోదించాకే కేబినెట్ భేటీ నిర్వహించాల్సి ఉంటుందని అన్నారు. కేబినెట్ అజెండా పరిశీలనకు కనీసం 48 గంటల సమయం పడుతుందని చెప్పారు.