రూ. 27 కోట్ల లాటరీ కొట్టిన ఎన్నారై... చెబుదామంటే ఆచూకీ ఎక్కడ?

  • యూఏఈలో బిగ్ టికెట్ సిరీస్ డ్రా
  • శోభిత్ కు తగిలిన జాక్ పాట్
  • ఎక్కడున్నాతో తెలీదంటున్న నిర్వాహకులు
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఇండియన్ సంతతికి చెందిన శోభిత్ అనే యువకుడు జాక్ పాట్ కొట్టాడు. అబూదాబిలో పన్నులు లేని బిగ్ టికెట్ సిరీస్ డ్రా జరుగగా, శోభిక్ కు 4 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 27 కోట్లు) లాటరీ తగిలింది. శోభిత్ ఈ టికెట్ ను గత నెల 1వ తేదీన కొన్నాడు. ఈ లాటరీ యూట్యూబ్ లో లైవ్ కూడా వచ్చింది. కానీ, శోభిత్ ఎక్కడున్నాడన్న విషయం మాత్రం లాటరీ నిర్వాహకులు ఇంతవరకూ కనుగొనలేదు.

శోభిత్ కు పలుమార్లు ఫోన్ చేసినా, ఆయన స్పందించలేదని, అతని ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నామని నిర్వాహకులు వెల్లడించారు. ఆయన ఎక్కడ నివసిస్తారో తమకు తెలుసునని ఇంటికి వెళ్లి విషయం చెప్పి వస్తామని డ్రా నిర్వహించిన రిచర్డ్‌ తెలిపారు. ఇదే డ్రాలో ఇండియాకు చెందిన మంగేశ్‌ అనే వ్యక్తి బీఎండబ్ల్యూ 220ఐ కారును గెల్చుకున్నారని ఆయన అన్నారు.
Go Back to Shorts
UAE
Lottery
Indian
Draw

More Telugu News