రజనీ 'దర్బార్'లో నివేదా థామస్
- రజనీకాంత్ కథానాయకుడిగా 'దర్బార్'
- కథానాయికగా నయనతార
- రజనీ కూతురు పాత్రలో నివేదా థామస్
ఆమె కూడా ఈ సినిమా షూటింగులో జాయిన్ అయిందనేది తాజా సమాచారం. ఈ సినిమాలో ఆమె రజనీకాంత్ కూతురు పాత్రలో కనిపించనుందనే టాక్ వినిపిస్తోంది. ఈ పాత్రకి ప్రాధాన్యత ఉండటం వల్లనే నివేదా ఒప్పుకుందని అంటున్నారు. ఇక ఈ సినిమాలో రజనీ ద్విపాత్రాభినయం చేస్తున్నారనే ప్రచారం కూడా జోరుగా జరుగుతోంది. రజనీకాంత్ ను ఎదుర్కునే ప్రతినాయకుడిగా బాలీవుడ్ నటుడు ప్రతీక్ బబ్బర్ నటిస్తున్నాడు. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.