మీ ప్రాణాల్ని రిస్క్‌లో పెట్టి.. నాపై ప్రేమను చూపడం సరికాదు.. ఆ వీడియో చూశాక చాలా బాధపడ్డా: లారెన్స్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మీ ప్రాణాల్ని రిస్క్‌లో పెట్టి.. నాపై ప్రేమను చూపడం సరికాదు.. ఆ వీడియో చూశాక చాలా బాధపడ్డా: లారెన్స్

  • కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు
  • పేద పిల్లలకు పుస్తకాలు కొని ఇవ్వండి
  • వృద్ధులకు సహాయం చేయండి
  • ఇలాంటి పనుల్ని నేను ప్రోత్సహించను
కోలీవుడ్ ప్రముఖ నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ నటించిన ‘కాంచన 3’ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా థియేటర్ల ముందు లారెన్స్ అభిమానులు భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు. ‘కాంచన 3’కి మంచి స్పందన రావడంతో ఓ అభిమాని సంబరపడిపోయి లారెన్స్ కటౌట్‌కి పాలాభిషేకం చేశాడు. అయితే దీని కోసం పెద్ద స్టంట్ చేశాడు. క్రేన్ కొక్కేనికి వేలాడుతూ కటౌట్ పైకి వెళ్లి మరీ పాలాభిషేకం చేశాడు. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవడంతో దానిని లారెన్స్ చూసి ఆవేదన వ్యక్తం చేస్తూ పోస్ట్ పెట్టాడు. ‘అభిమానులు, స్నేహితులకు నా విన్నపం. ఓ అభిమాని క్రేన్‌కు వేలాడుతూ నా బ్యానర్‌కు పాలాభిషేకం చేస్తున్న వీడియోను చూశా.

ఆ వీడియో చూసిన తర్వాత చాలా బాధపడ్డా. ఇలాంటి రిస్క్‌లను తీసుకోవద్దని నా అభిమానుల్ని కోరుతున్నా. మీ ప్రాణాల్ని రిస్క్‌లో పెట్టి, నాపై ఉన్న ప్రేమను ఇలా చూపడం సరికాదు. మీ కోసం ఇంటి దగ్గర కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు. వాళ్లని మనసులో ఉంచుకుని ప్రవర్తించండి. నిజంగా మీకు నాపై ప్రేమను నిరూపించుకోవాలని ఉంటే పేద పిల్లలకు పుస్తకాలు కొని ఇవ్వండి. వారి ఫీజులు కట్టండి. ఆహారం లేక ఇబ్బంది పడుతున్న వృద్ధులు చాలా మంది ఉన్నారు, వారికి సహాయం చేయండి. అది నాకు సంతోషాన్నిస్తుంది, గర్వపడేలా చేస్తుంది. ఇలాంటి పనుల్ని నేను ప్రోత్సహించను. మరోసారి ఇలాంటి ఘటన జరగకూడదని కోరుతున్నా. మీ జీవితం చాలా ముఖ్యమైంది.. దాన్ని గుర్తు పెట్టుకోండి’ అని లారెన్స్‌ పోస్ట్‌ చేశారు.

Raghava Lawrance
Kanchana 3
Social Media
Crane
Fan

More Telugu News