బాలూగారి నుంచి నేను నేర్చుకున్నది అదే: సింగర్ మనో
Add ap7am to your home Screen

బాలూగారి నుంచి నేను నేర్చుకున్నది అదే: సింగర్ మనో

  • బాలూగారి స్వరంతో పోల్చడం ఆనందం
  • ఆయనతో కలిసి ప్రయాణించడమే అదృష్టం
  • ఓపికతో ఉండటం నేర్చుకున్నాను  
గాయకుడిగా మనో తన ప్రయాణాన్ని ప్రారంభించిన తరువాత, ఆయన వాయిస్ బాలూ వాయిస్ మాదిరిగా ఉందని అంతా చెప్పుకున్నారు. తాజా ఇంటర్వ్యూలో ఆ విషయం ప్రస్తావనకు రాగా, మనో తనదైన శైలిలో స్పందించారు. "బాలూ గారి వాయిస్ తో నా వాయిస్ ను పోల్చడం ఒక అదృష్టంగా నేను భావిస్తాను. అంతటి గొప్ప గాయకుడి స్వరానికి దగ్గరగా నా స్వరం ఉందంటే అంతకన్నా పెద్ద వరం ఏముంటుంది?

స్వరం విషయంలో బాలూగారితో నన్ను పోల్చడం .. తండ్రితో బిడ్డను పోల్చడం వంటిది. బాలూగారితో కలిసి ప్రయాణించడమే గొప్ప విషయంగా భావిస్తుంటాను. నిజం చెప్పాలంటే ఒకప్పుడు నేను షార్ట్ టెంపర్ ని. అలాంటిది బాలూగారిని చూసిన తరువాత ఎంతటి సహనంతో ఉండాలో .. ఓపికతో ఉండాలో నేర్చుకున్నాను. ఓర్పుతో వుండేవారినే విజయాలు వరిస్తాయనీ .. రిలేషన్ షిప్ నిలబడుతుందని తెలుసుకుని అదే పద్ధతిని ఫాలో అవుతూ వస్తున్నాను" అని చెప్పుకొచ్చారు. 
mano
balu

More Telugu News