మమత బయోపిక్ ‘బాఘిని: బెంగాల్ టైగ్రెస్‌’కు బీజేపీ మోకాలడ్డు

18-04-2019 Thu 07:03 | National
  • పీఎం నరేంద్రమోదీ సినిమాను సమీక్షించినట్టుగానే దీనినీ సమీక్షించాలని కోరిన బీజేపీ
  • ఎన్నికల సంఘం, బెంగాల్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్లకు లేఖలు
  • మమత బయోపిక్ కాదంటున్న దర్శకనిర్మాతలు
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ జీవిత కథ ఆధారంగా రూపొందిన ‘బాఘిని:బెంగాల్ టైగ్రెస్‌’ సినిమా విడుదలపై బీజేపీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. సినిమాను విడుదల కాకుండా అడ్డుకోవాలంటూ ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. ప్రధాని నరేంద్రమోదీ జీవితకథ ఆధారంగా రూపొందించిన ‘పీఎం నరేంద్రమోదీ’ సినిమాను సమీక్షించినట్టుగానే మమత బయోపిక్‌ను కూడా సమీక్షించాలని కోరింది.

అయితే, బీజేపీ అభ్యంతరాలను సినిమా దర్శకనిర్మాతలు కొట్టిపడేశారు. నిజానికి ఈ సినిమా మమత బయోపిక్ కాదని, ఆమె జీవితం నుంచి స్ఫూర్తి పొంది రాసుకున్న కథ మాత్రమేనని పేర్కొన్నారు. ‘బాఘిని:బెంగాల్ టైగ్రెస్‌’ సినిమాలో నాయకురాలు ఇందిరా బందోపాధ్యాయ్‌ పాత్రలో రుమా చక్రవర్తి నటించారు. అమెను అందరూ ‘దీదీ’ అని పిలుస్తుంటారు. దీనికి తోడు ఈ సినిమా ట్రైలర్‌లో ఇందిర పాత్ర మమతను పోలి ఉండడం కూడా బీజేపీ అభ్యంతరాలకు ఓ కారణం.

అంతేకాదు, అప్పట్లో జరిగిన సింగూరు, నందిగ్రామ్ ఉద్రిక్తతలను కూడా ఈ సినిమాలో ప్రస్తావించారు.  అప్పటి సీపీఎం ప్రభుత్వం మీద ‘పరివర్తన్’ పేరుతో మమత తలపెట్టిన ర్యాలీ గురించి కూడా చూపించారు. దీంతో ఈ సినిమాను మమత జీవిత చరిత్ర ఆధారంగానే రూపొందించారని బీజేపీ వాదిస్తోంది. అందుకే విడుదలను అడ్డుకోవాలంటూ ఎన్నికల సంఘం, బెంగాల్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్లకు లేఖ రాసింది. బీజేపీ అభ్యంతరాలు ఎలా ఉన్నా ‘బాఘిని:బెంగాల్ టైగ్రెస్‌’ సినిమాకు సెన్సార్ బోర్డు ఇప్పటికే క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇచ్చినట్టు సమాచారం.
BaghinibiopicMamata BanerjeeWest BengalBJP

More Telugu News

సీఐ 'బలహీనత'నే ఎరగా వేసి.. ఆరు నెలలు బందీగా మార్చి..

25-10-2026 Sun 07:10

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21
..more