పవన్ కల్యాణ్ తో గొడవను గురించి అలీని డైరెక్ట్ గా అడిగేసిన రేణూ దేశాయ్!

  • గొడవైందని అంగీకరించిన అలీ
  • సినిమాలకు ఎడిటర్ గా పనిచేసినా డబ్బులివ్వలేదన్న రేణు
  • తన పెళ్లిని దాచాల్సిన అవసరం లేదన్న సీనియర్ నటి
హాస్య నటుడు అలీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం, దానికన్నా ముందు ఆయన పవన్ కల్యాణ్ తో పాటు చంద్రబాబుతోనూ భేటీ అయిన సంగతి అందరికీ తెలిసిందే. వైసీపీలో చేరిన తరువాత, అలీ లాంటి వ్యక్తిని తాను ఇంతవరకూ చూడలేదని, సాయం పొంది మోసం చేసిన అతన్ని చూసిన తరువాత, ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలియడం లేదని పవన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు కూడా. వాటిని అలీ సైతం గట్టిగానే తిప్పికొట్టారు.

ఇక తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి గెస్ట్ గా వచ్చిన పవన్ మాజీ భార్య రేణూ దేశాయ్, ఈ వ్యవహారం గురించి అలీని రివర్స్ ప్రశ్న వేశారు. తానో సీరియస్ ప్రశ్న అడగాలని అనుకుంటున్నానని చెప్పిన రేణూ, "మీకు, కల్యాణ్ గారికి చాలా పెద్ద గొడవైందని విన్నాను. నిజమేనా?" అని అడిగితే, దానికి అలీ "అయ్యింది" అని అన్నారు. ఇంకా ఈ ఇంటర్వ్యూలో తన పేరును రేవతి అనో లేదా రేవా అనో పెడితే బాగుండేదని చెప్పుకొచ్చారు.

'జానీ' చిత్రం షూటింగ్ సమయంలో ముంబైలో పవన్, అలీలతో కలిసెళ్లి పానీపూరీ తిన్న సంగతులు గుర్తు చేసుకున్నారు. 'జానీ', 'ఖుషీ' సినిమాలకు తాను ఎడిటింగ్ చేశానని, అందుకు తనకు రూపాయి కూడా ఇవ్వలేదని, అందుకు తన మాజీ భర్త పవనే సాక్ష్యమని అన్నారు. తనకిప్పుడు ఎంగేజ్ మెంట్ అయిపోయిందని, తన పెళ్లిని ఎక్కడా దాచాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రస్తుతం తన బిడ్డలతోనే తన ప్రపంచమని, కుమార్తె లేనిదే తాను లేనని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమం రేపు ప్రసారం కానుంది.
Go Back to Shorts
Ali
Renu Desai
Pawan Kalyan

More Telugu News