లక్ష్మీపార్వతిపై చేసిన ఆరోపణలు పక్కా ప్లాన్: రామ్ గోపాల్ వర్మ అనుమానం
- లక్ష్మీపార్వతికి క్లాసికల్ మ్యూజిక్ అంటే ఇష్టం
- పాటలు నింపుతానని ఆమె ఫోన్ ని తీసుకున్నాడు
- ఆ ఫోన్ నుంచి అతని ఫోన్ కు మెస్సేజ్ లు పంపుకున్నాడు
నాలుగేళ్లుగా ఆమెతో పరిచయం ఉందని చెబుతున్న అతను ఈ పని ఎందుకు చేస్తాడు? అతనితో ఎవరో చేయించి ఉంటారన్న అనుమానం వ్యక్తం చేశారు. వాళ్లిద్దరి మధ్య జరిగిన ఓ ఆడియో రికార్డును గురించి ప్రస్తావిస్తూ, లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం విడుదలకు ఒకట్రెండు రోజుల ముందు ఈ రికార్డింగ్ చేశాడని, కావాలని చెప్పి ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా ఆమెతో మాట్లాడించారన్న అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఆడియో రికార్డింగ్ లో ఎక్కడా కూడా లక్ష్మీపార్వతిపై అతను ఏవైతే ఆరోపణలు చేశాడో అలాంటి భావాలు వ్యక్త పరుస్తున్నట్టుగా ఆమె మాట్లాడలేదన్న విషయం స్పష్టంగా తెలిసిపోతుందని అన్నారు. వందశాతం ఈ ఆడియో రికార్డింగ్ కావాలని సృష్టించిందేనని వర్మ స్పష్టం చేశారు.