కీర్తి సురేశ్ పై దృష్టిపెట్టిన కొరటాల .. మెగాస్టార్ సరసన ఛాన్స్?
- చిరూ 151వ సినిమాగా 'సైరా'
- కొరటాలతో చిరూ తదుపరి సినిమా
- తెరపైకి కీర్తి సురేశ్ పేరు
ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం శ్రుతి హాసన్ ను ఎంపిక చేసినట్టుగా వార్తలు వచ్చాయి. తాజాగా కీర్తి సురేశ్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో కీర్తి సురేశ్ కి ఇప్పుడు ఒక రేంజ్ లో ఇమేజ్ వుంది. అందువలన ఆమెను తీసుకోవాలనే ఉద్దేశంతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా సమాచారం. అయితే శ్రుతి హాసన్ బదులుగా కీర్తి సురేశ్ ను తీసుకోనున్నారా? లేదంటే మరో కథానాయికగా తీసుకోనున్నారా? అనే విషయంలో క్లారిటీ రావలసి వుంది. ఈ చిత్రం జూన్ నుంచి సెట్స్ పైకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది.