కాంగ్రెస్ మేనిఫెస్టో కవర్ పేజీపై చిన్నగా రాహుల్ ఫొటో.. సోనియా అసంతృప్తి

  • మేనిఫెస్టో కవర్‌పేజీని జనాలతో నింపేసిన వైనం
  • అడుగున హస్తం గుర్తు, రాహుల్ ఫొటోలు 
  • మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో ముభావంగా సోనియా
కాంగ్రెస్ మేనిఫెస్టో కవర్ పేజీపై ముద్రించిన రాహుల్ గాంధీ ఫొటోపై యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ ఫొటో చిన్నగా ఉండడం చూసి సోనియా అసంతృప్తి వ్యక్తం చేశారని, ఈ విషయమై ఏఐసీసీ రీసెర్చి కమిటీ హెడ్‌ రాజీవ్‌ గౌడపై సోనియా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. కవర్ పేజీపై మహాత్మాగాంధీ, కాంగ్రెస్ లోగో, రాహుల్ గాంధీ ఫొటోలు ఇంకాస్త పెద్ద పరిణామంలో ఉంటే బాగుండేదని సోనియా అభిప్రాయపడినట్టు తెలుస్తోంది.

మంగళవారం జరిగిన మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో విలేకరుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పేందుకు సోనియా నిరాకరించారు. కార్యక్రమానికి హాజరైన వారిని ఉద్దేశించి మాట్లాడడానికి కూడా ఆమె నిరాకరించారు. అయితే, పార్టీ సీనియర్ నేతలైన మన్మోహన్ సింగ్, చిదంబరం వంటి వారు మాట్లాడారు. మేనిఫెస్టో కవర్ పేజీని జనాలతో నింపేసి కింద మాత్రం కాంగ్రెస్ పార్టీ గుర్తు అయిన హస్తం, ఆ పక్కన రాహుల్ గాంధీ ఫొటోలను ముద్రించారు.
Go Back to Shorts
Congress
Sonia Gandhi
manifesto
Rahul Gandhi

More Telugu News