ఫార్మా మాఫియా చుట్టూ తిరిగే తమిళ థ్రిల్లర్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఫార్మా మాఫియా చుట్టూ తిరిగే తమిళ థ్రిల్లర్!

Regai Series Update
  • తమిళ సిరీస్ గా రూపొందిన 'రేగై'
  • 7 ఎపిసోడ్స్ గా రూపొందిన సిరీస్ 
  • క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే కథ
  • నిదానంగా సాగే కథనం
  • తెలుగులోను అందుబాటులోకి వచ్చే ఛాన్స్   
           

క్రైమ్ థ్రిల్లర్ .. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సిరీస్ లను తెరకెక్కించడంలో తమిళ దర్శకులు తమదైన  నైపుణ్యాన్ని కనబరుస్తూ ఉంటారు. అందువలన తమిళ సిరీస్ లను చూడటానికి ఇతర భాషా ప్రేక్షకులు సైతం ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. అలాంటి థ్రిల్లర్ జోనర్ నుంచి ఆడియన్స్ పలకరించిన తమిళ సిరీస్ గా 'రేగై' కనిపిస్తుంది. 2025 చివర్లో 'జీ 5' ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి వచ్చిన ఈ సిరీస్, ఫార్మా మాఫియా నేపథ్యంలో కొనసాగుతోంది. 

శింగరవేలన్ నిర్మించిన ఈ సిరీస్, 7 ఎపిసోడ్స్ గా అందుబాటులోకి వచ్చింది. దినకరన్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ లో, బాలహసన్ .. పవిత్ర జనని .. వినోదిని వైద్యనాథన్ .. ప్రధానమైన పాత్రలను పోషించారు. పోలీస్ ఆఫీసర్ 'వెట్రి' గా బాలహసన్ నటించిన ఈ సిరీస్ లో, కానిస్టేబుల్ 'సంధ్య'గా పవిత్ర జనని కనిపిస్తుంది. వరుస హత్యల నేపథ్యంలో ఈ సిరీస్ కొనసాగుతుంది. వాటిని ఛేదించే విధానమే ఈ కథపై కుతూహలాన్ని రేపుతుంది. 

హాస్టల్ బాత్ రూమ్ లో జరిగిన ఒక హత్యకి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ను 'వెట్రి' మొదలు పెడతాడు. అదే సమయంలో అతనికి శరీరం నుంచి వేరు చేయబడిన ఒక 'చేయి' దొరుకుతుంది. ఆ చేయి ఎవరిది? హంతకుడు ఎవరు? ఎందుకు హత్యలు చేస్తున్నాడు? చనిపోయిన వారి మధ్య గల సంబంధం ఏమిటి? అనే అంశాల చుట్టూ ఈ కథ నడుస్తుంది. సీరియల్ మాదిరిగా కథాకథనాలు నిదానంగా కొనసాగినప్పటికీ, మెయిన్ లైన్ ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తుంది. త్వరలో తెలుగులోను అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. 

Advertisement
-

More Telugu News