అఖిలేశ్ యాదవ్‌పై భోజ్‌పురి సూపర్‌స్టార్ దినేశ్ లాల్ యాదవ్‌ను బరిలోకి దింపిన బీజేపీ
- 20 సినిమాల్లో నటించిన దినేశ్ లాల్
- ఇటీవలే యోగి సమక్షంలో బీజేపీలో చేరిక
- సోనియాగాంధీతో తలపడనున్న దినేశ్ ప్రతాప్ సింగ్
ఇక, శివసేనను విమర్శించిన బీజేపీ ఈశాన్య ముంబై సిట్టింగ్ ఎంపీ కిరీట్ సోమయకు షాకిస్తూ మనోజ్ కోటక్‌కు టికెట్ కేటాయించింది. యూపీలోని మెయిన్‌పురి నుంచి బరిలో ఉన్న ములాయం సింగ్ యాదవ్‌కు ప్రత్యర్థిగా ప్రేమ్ సింగ్ శాక్యాను పోటీలో నిలిపింది. రాయ్‌బరేలీలో సోనియాపై దినేశ్ ప్రతాప్ సింగ్‌ను బరిలోకి దింపింది. ఇక, అఖిలేశ్ యాదవ్‌పై పోటీ చేస్తున్న దినేశ్ లాల్ యాదవ్ 2006లో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు. ఆయన ఇప్పటి వరకు 20 సినిమాల్లో నటించారు. ఇటీవలే యోగి సమక్షంలో బీజేపీలో చేరిన ఆయనకు అంతలోనే టికెట్ ఇచ్చింది.