మోహన్ లాల్ నుంచి 'లూసిఫెర్' .. 4 రోజుల్లో 50 కోట్లు
Add ap7am to your home Screen

మోహన్ లాల్ నుంచి 'లూసిఫెర్' .. 4 రోజుల్లో 50 కోట్లు

  • మోహన్ లాల్ హీరోగా 'లూసిఫెర్'
  • అన్ని ప్రాంతాల్లోను భారీ వసూళ్లు
  • అభిమానుల్లో ఆనందం  
మొదటి నుంచి కూడా మోహన్ లాల్ వైవిధ్యభరితమైన కథా చిత్రాలను చేస్తూ వస్తున్నారు. మలయాళ సూపర్ స్టార్ గా ఆయన తన హవాను కొనసాగిస్తూనే ఉన్నారు. ఆయన తాజా చిత్రంగా మలయాళంలో 'లూసిఫెర్' క్రితం నెల 28వ తేదీన విడుదలైంది. తొలి 4 రోజుల్లోనే ఈ సినిమా 50 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. మలయాళంలో చాలా తక్కువ సమయంలో ఈ స్థాయి వసూళ్లను సాధించిన చిత్రంగా ఇది కొత్త రికార్డును నెలకొల్పింది.

పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన ఈ సినిమా వసూళ్ల పరంగా తన జోరును కొనసాగిస్తూనే వుంది. వివేక్ ఒబెరాయ్ .. మంజు వారియర్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. మోహన్ లాల్ నుంచి ఇంతకుముందు వచ్చిన 'ఒడియన్' .. పరాజయంపాలు కావడంతో డీలాపడిన ఆయన అభిమానులు, 'లూసిఫెర్' సక్సెస్ తో ఖుషీ అవుతున్నారు.
mohan lal
manju

More Telugu News