'వెంకీమామ' కూడా దసరాకే బరిలోకి దిగుతాడట
- తొలి షెడ్యూల్ పూర్తిచేసుకున్న 'వెంకీమామ'
- వెంకీ కూతురు పెళ్లి సందర్భంగా బ్రేక్
- ఈ నెల 8 నుంచి రెండవ షెడ్యూల్
ఈ నెల 8వ తేదీ నుంచి షూటింగుకి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జూలై నెల చివరివరకూ నాన్ స్టాప్ గా షూటింగు కొనసాగేలా ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమాలో వెంకీ సరసన పాయల్ రాజ్ పుత్ .. చైతూ జోడీగా రాశి ఖన్నా నటిస్తున్నారు. దసరా పండుగ రోజుల్లో ఈ సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి దర్శక నిర్మాతలు వచ్చినట్టుగా సమాచారం.