ఇంట్లో మాత్రమే ఫ్యాన్, బార్ కు వెళ్లనున్న గ్లాస్... అసెంబ్లీకి సైకిల్ మాత్రమే: బాలకృష్ణ
Add ap7am to your home Screen

ఇంట్లో మాత్రమే ఫ్యాన్, బార్ కు వెళ్లనున్న గ్లాస్... అసెంబ్లీకి సైకిల్ మాత్రమే: బాలకృష్ణ

  • లేపాక్షి మండలంలో బాలయ్య పర్యటన
  • టీడీపీకి ఓటేస్తేనే అభివృద్ధి
  • కాసేపు ట్రాక్టర్ నడిపిన బాలకృష్ణ
రానున్న ఎన్నికల తరువాత ఫ్యాన్ ఇంటికి మాత్రమే పరిమితం అవుతుందని, గ్లాస్ బార్ కు పోతుందని, అసెంబ్లీకి వెళ్లేది సైకిల్ మాత్రమేనని హిందూపురం టీడీపీ అభ్యర్థి, నటుడు బాలకృష్ణ వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా లేపాక్షి మండలంలోని పలు గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేసే ప్రతి ఓటూ మోడీకి వేసినట్లేనని అన్నారు. టీడీపీకి ఓటు వేస్తే ఏపీ మరింతగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన వాగ్ధానాలతో పోలిస్తే, మరిన్ని అమలు చేసిన ఘనత చంద్రబాబుదేనని బాలకృష్ణ వ్యాఖ్యానించారు. నియోజకవర్గంలోని చెరువులకు నీరిచ్చామని, ప్రతి ఒక్కరికీ పెన్షన్లు, రేషన్ కార్డులు మంజూరైనాయని అన్నారు. ప్రచారం సందర్భంగా, తనకు ఎదురైన ట్రాక్టర్ ను ఆపి, దాన్ని కాసేపు నడుపుతూ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపిన బాలయ్య, రానున్నది టీడీపీ ప్రభుత్వమేనని అన్నారు.
Balakrishna
Hindupuram
Elections
Campaign

More Telugu News