టీఆర్ఎస్ కు రాజీనామా చేసిన మాజీ ఎంపీ జి.వివేక్.. కేసీఆర్ ద్రోహం చేశారని మండిపాటు!
- ఇప్పటికే ప్రభుత్వ సలహాదారు పదవికి గుడ్ బై
- ఈసారి ఎన్నికల్లో పోటీచేయకూడదని నిర్ణయం
- పార్టీ వ్యతిరేక పనులు చేశారంటున్న టీఆర్ఎస్ వర్గాలు
అయితే కార్యకర్తలతో నిన్న, ఈరోజు జరిగిన సమావేశాల్లో ఓ నిర్ణయానికి రాలేకపోయారు. ఈ నేపథ్యంలో ఈసారి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయకూడదని వివేక్ నిర్ణయించుకున్నారు. సమయం తక్కువగా ఉండటంతో స్వతంత్ర అభ్యర్థిగానూ పోటీ చేయరాదని నిర్ణయించుకున్నట్లు ఆయన సన్నిహితవర్గాలు తెలిపాయి.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ద్రోహం కారణంగానే తాను పోటీకి దూరమయ్యానని వివేక్ ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితుడిని అయినందునే తనపై వివక్ష చూపారన్నారు. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడటంతో వివేక్ కు పెద్దపల్లి లోక్ సభ టికెట్ నిరాకరించినట్లు టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి.