ఆత్మహత్య చేసుకుంటానంటూ పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్ సెల్ఫీ వీడియో

16-03-2019 Sat 20:02 | Andhra
  • జగన్ పై అలక
  • కలిసేందుకు అవకాశం ఇవ్వడంలేదు
  • చనిపోయేవాళ్లు నిజమే చెబుతారంటూ వ్యాఖ్యలు
పూతలపట్టు శాసనసభ్యుడు సునీల్ తనకు ఈసారి ఎన్నికల్లో సీటు ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ సెల్ఫీ వీడియోలో బెదిరించడం సంచలనం సృష్టిస్తోంది. గత మూడు రోజులుగా తనకు జగన్ అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని సునీల్ మనస్తాపానికి గురయ్యారు. జగన్ అపాయింట్ మెంట్ దొరక్కపోవడంతో మొదట ఓ సెల్ఫీ వీడియోలో బాధపడిన సునీల్...  తాజాగా రూపొందించిన సెల్ఫీ వీడియోలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

తనకు సీటు ఇవ్వకపోయినా ఫర్వాలేదు కానీ తనపై వచ్చిన ఆరోపణలు దారుణమని అభిప్రాయపడ్డారు. తనకు జగన్ అంటే ప్రాణం అని, ప్రజాసేవ చేసుకునే అవకాశం ఇచ్చారని సునీల్ తెలిపారు. ప్రతిరోజు లేవగానే సాక్షి పేపర్లో గానీ, వాట్సాప్ లో గానీ, ఇతర సోషల్ మీడియా సైట్లలో గానీ మీ ముఖం చూస్తే గానీ సంతోషం కలగదని జగన్ పై తన అభిమానాన్ని ప్రదర్శించారు.

కానీ కొందరు నాయకులు ఈ ఎమ్మెల్యే టీడీపీకి అమ్ముడుపోవడానికి సిద్ధపడ్డాడు కాబట్టే జగన్ టికెట్ ఇవ్వకుండా దూరం పెడుతున్నాడని దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ, జగన్ ఈ విషయంలో తనను అపార్థం చేసుకుంటే భరించలేనని స్పష్టం చేశారు. తాను ఎంతో అభిమానించే జగన్ మనసు చూరగొనలేకపోయానన్న బాధ తనను దహించి వేస్తోందని అన్నారు.

తాను ఓ డాక్టర్ నని, తాను మానసికంగా ఎంతో దృఢంగా ఉంటానని చెబుతూ... నిజాయతీగా ఉండాలని ప్రయత్నించినా వీలుకాకపోవడంతోనే ఈ సెల్ఫీ వీడియో ద్వారా తన ఆవేదన వ్యక్తం చేస్తున్నానని తెలిపారు. దయచేసి అందరూ జగన్ కు ఓట్లేసి గెలిపించాలని కోరుతున్నానని చెబుతూ వీడియో ముగించారు సునీల్. చనిపోయేవాళ్లు నిజమే చెబుతారంటారని, ఇప్పుడు తాను చెప్పేది కూడా నిజమని నమ్మాలంటూ విజ్ఞప్తి చేశారు.


YSRCPJagan

More Telugu News

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08
..more