చంద్రబాబు మళ్లీ సీఎం కావాలంటూ కర్నూలులో చండీహోమం
- టీడీపీ మళ్లీ అధికారంలోకి రావాలని యాగం
- జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి ఆధ్వర్యంలో మూడు రోజులపాటు క్రతువు
- హాజరైన నేతలు
కర్నూలులోని గాయత్రీ ఎస్టేట్ విశ్వేశ్వరయ్య సర్కిల్ వద్ద నిర్వహించిన ఈ హోమం టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జరిగింది. రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్, ఎమ్మెల్సీలు కేఈ ప్రభాకర్, బీటీ నాయుడు తదితరులు పాల్గొన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీల గెలుపు కోసమే ఈ యాగం నిర్వహించినట్టు ఎంపీ టీజీ వెంకటేశ్ తెలిపారు. తన కుమారుడు భరత్ పేరు రెండో జాబితాలో ఉండే అవకాశం ఉందని, తాను తన కుమారుడి గెలుపు కోసం ప్రార్థించినట్టు వెంకటేశ్ పేర్కొన్నారు.