కడప, పులివెందులను గెలుస్తామని టీడీపీ నేతలు పదే పదే చెప్పారు.. సిట్ పై నమ్మకం లేదు: వాసిరెడ్డి పద్మ
- ఆదినారాయణరెడ్డిని ఎంపీ అభ్యర్థిగా ప్రకటించినప్పుడే.. మహా కుట్రకు బీజం పడింది
- జమ్మలమడుగులో ఆయన ఎలాంటి అకృత్యాలకు పాల్పడ్డారో అందరికీ తెలుసు
- వివేకా మరణంపై సీబీఐ విచారణ జరిపించాలి
వివేకా మరణంపై నిష్పక్షపాతంగా విచారణ జరగాలని వాసిరెడ్డి పద్మ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ తో నిజనిజాలు వెలుగు చూస్తాయనే నమ్మకం తమకు లేదని చెప్పారు. అసలైన నిజాలు వెలుగు చూడాలంటే సీబీఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.