ఐస్ తింటుండగా బయటపడ్డ బల్లి.. పోలీసులకు ఫిర్యాదు!

15-03-2019 Fri 11:02 | Telangana
  • కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో ఘటన
  • తోపుడు బండి వద్ద ఐస్ కొన్న శ్రీకాంత్
  • పోలీసులను ఆశ్రయించిన బాధితుడు
వేసవి తాపానికి తాళలేక మనలో చాలామంది శీతల పానీయాలు తాగితే, మరికొంతమంది ఐస్ క్రీములను ఆశ్రయిస్తుంటారు. అయితే చాలా సందర్భాల్లో ఐస్, ఐస్ క్రీమ్ ల తయారీదారులు నాణ్యత పాటించకుండానే వాటిని వినియోగదారులకు అంటగడుతూ ఉంటారు. తాజాగా ఈ తరహా ఘటన తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది.

జిల్లాలోని హుజూరాబాద్ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన శ్రీకాంత్ అనే యువకుడు ఓ తోపుడు బండి వద్ద ఐస్ కొన్నాడు. అనంతరం దాన్ని తింటుండగా నోటికి ఏదో తగిలినట్లు అనిపించింది. ఏంటా.. అని చూసేసరికి ఐస్ లో చచ్చిన బల్లి కనిపించింది. దీంతో ఒక్కసారిగా వాంతులు చేసుకున్న బాధితుడు ఆసుపత్రిలో చేరాడు.

ఈ విషయం గ్రామంలో తెలియడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, ఈ ఐస్ తయారీదారులపై కేసు నమోదు చేయాలని బాధితుడు శ్రీకాంత్ పోలీసులను ఆశ్రయించాడు.
TelanganaKarimnagar Districtballilizardiceice cream

More Telugu News

సీఐ 'బలహీనత'నే ఎరగా వేసి.. ఆరు నెలలు బందీగా మార్చి..

25-10-2026 Sun 07:10

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21
..more