జగన్‌ పట్ల ప్రజల్లో విశ్వాసం ఉంది...ఆయన విజయం కోసం పనిచేస్తా: హాస్య నటుడు అలీ

11-03-2019 Mon 11:11 | Andhra
  • ఎప్పుడో పార్టీలో చేరాల్సింది...ఇప్పటికి వీలైంది
  • ఎన్నికల్లో మాత్రం పోటీ చేయను
  • జగన్‌ని సీఎంగా చూడడమే నా లక్ష్యం
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకున్న ప్రముఖ టాలీవుడ్‌ హాస్య నటుడు అలీ జగన్‌ను ముఖ్యమంత్రి చేసేందుకు తనవంతు ప్రయత్నం చేస్తానని చెప్పారు. రానున్న ఎన్నికల్లో తాను ఎక్కడి నుంచీ పోటీ చేయడం లేదని, కేవలం పార్టీ తరపున ప్రచారం మాత్రం చేస్తానని తెలిపారు. లోటస్‌పాండ్‌లో ఈరోజు ఉదయం జగన్‌ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్న ఆయన అనంతరం విలేకరులతో మాట్లాడారు.

 జగన్‌ మోహన్‌రెడ్డి పట్ల ప్రజల్లో విశ్వాసం ఉందని, ఆయన ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారని తెలిపారు.  ‘ప్రజా సంకల్ప యాత్ర సమయంలోనే నేను జగన్‌ని కలిశాను. మాట్లాడాను. పార్టీలో చేరమని ఆయన కోరారు. కానీ నేనే కొంత సమయం కావాలన్నాను’ అని అలీ చెప్పుకొచ్చారు. తన పాదయాత్ర సమయంలో జగన్‌ పలువురికి టికెట్‌పై హామీ ఇచ్చారని, అందువల్ల తనకు టికెట్‌ దక్కే అవకాశం లేదన్నారు. ఒకవేళ ఎక్కడి నుంచైనా పోటీ చేయాలని జగన్‌ ఆదేశిస్తే తప్పకుండా శిరసావహిస్తానని చెప్పారు.
comedian aliYSRCPJagan

More Telugu News

సీఐ 'బలహీనత'నే ఎరగా వేసి.. ఆరు నెలలు బందీగా మార్చి..

25-10-2026 Sun 07:10

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21
..more