పంజాబ్‌లో దారుణ ఘటన.. ఏడేళ్ల బాలికపై హత్యాచారం!

  • లూథియానాలో ఘటన
  • చిన్నారి బంధువే నిందితుడు
  • కిడ్నాప్ చేసి మరీ ఘాతుకం
పంజాబ్‌లోని లూథియానాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఏడేళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఓ కిరాతకుడు, ఆపై ఆమెను హత్య చేశాడు. బాలిక బంధువే ఈ దారుణానికి ఒడిగట్టిన విషయం తెలిసి పోలీసులే నివ్వెరపోతున్నారు. పోలీసుల కథనం మేరకు.. జిల్లాలోని దొరాహా పట్టణంలో బాలిక బంధువు అయిన వ్యక్తి చిన్నారిని వారి ఇంటి నుంచి అపహరించాడు.

అనంతరం ఆమెను సమీపంలోనే ఉన్న ఖాళీ గోదాములోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ముక్కుపచ్చలారని ఆ చిన్నారిని దారుణంగా హత్యచేసి పరారయ్యాడు. కుమార్తె కనిపించకపోవడంతో కంగారు పడిన బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా విషయం వెలుగులోకి వచ్చింది. బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.
Go Back to Shorts
Punjab
ludhiana
Girl
Rape
Murder
Crime News

More Telugu News