అడవిలో అడుగుపెడితే మాయమే .. అక్కడి కాకి విగ్రహం చుట్టూ ఏం జరుగుతోంది?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అడవిలో అడుగుపెడితే మాయమే .. అక్కడి కాకి విగ్రహం చుట్టూ ఏం జరుగుతోంది?

Sambhavam Adhyayam Onnu Movie Update
  • మలయాళ సినిమాగా 'సంభవం అధ్యాయం ఒన్ను'
  • ఫారెస్టు నేపథ్యంలో నడిచే కథ
  • అడుగడుగునా అనూహ్యమైన మలుపులు
  • ఉత్కంఠను రేకెత్తించే సన్నివేశాలు 
  • హైలైట్ గా నిలిచే నేపథ్య సంగీతం - ఫొటోగ్రఫీ

కొన్ని కథలు కొత్తగా అనిపిస్తాయి .. తెరపై కొత్తగా కనిపిస్తాయి. సాధారణంగా ఫారెస్టు నేపథ్యంలో కథలు .. సస్పెన్స్ తో కూడిన కథలు .. టైమ్ లూప్ లో నడిచే కథలు .. అడుగడుగునా ఆసక్తిని రేపుతూ ఉంటాయి .. అయితే వీటన్నింటినీ కలుపుకుని సాగే కథ .. ఈ అంశాలన్నింటినీ కలిపి కాకి చుట్టూ తిప్పేకథ మరెంతటి ఉత్కంఠను కలిగిస్తుందనేది ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పని లేదు. అలాంటి ఒక కథతో రూపొందిన మలయాళ సినిమానే 'సంభవం అధ్యాయం ఒన్ను'

అలాంటి ఈ సినిమా ఈ నెల 15వ తేదీ నుంచి 'జియో హాట్ స్టార్'లో స్ట్రీమింగ్ అవుతోంది. అస్గర్ అలీ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాకి, జీతూ సతీషన్ దర్శకత్వం వహించాడు. ఈ కథ పోర్చుగ్రీసువారు ఈ నేలపై అడుగుపెట్టిన రోజుల నుంచి, ప్రస్తుతం కాలం వరకూ కొనసాగుతుంది. కేరళ - కర్ణాటక సరిహద్దు ప్రాంతంలోని ఒక దట్టమైన అడవిలో, కాకి తల .. మానవ దేహంతో కూడిన ఒక భారీ విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహం చుట్టూనే ఈ కథలోని ప్రధానమైన పాత్రలన్నీ తిరుగుతూ ఉంటాయి.

ఈ అడవిలోకి వెళ్లినవారెవరూ తిరిగిరారు. అడవిలోకి అడుగుపెట్టినవారెవరూ ఎలాంటి శబ్దం చేయకూడదు. ఎవరి రక్తం కూడా అక్కడి నేలపై పడకూడదు. అడవిలో ఆ కాకి విగ్రహం ఎక్కడిది? పోర్చుగ్రీసువారికీ .. ఆ కాకి విగ్రహానికి గల సంబంధం ఏమిటి? అక్కడికి వెళ్లినవారు ఏమైపోతున్నారు? అందుకు గల కారణం ఏమిటి? అనే ఆసక్తికరమైన మలుపులతో ఈ కథ కొనసాగుతుంది. ఈ మధ్య కాలంలో డిఫరెంట్ కంటెంట్ తో వచ్చిన సినిమాగా ఇది ఆకట్టుకుంటోది. ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం ఫారెస్ట్ లొకేషన్స్ ఈ సినిమాకి హైలైట్. ఫ్యామిలీతో కలిసి చూడవలసిన సినిమా ఇది.            
Advertisement
-

More Telugu News