మా రిమోట్ కంట్రోల్, భవిష్యత్ తెలంగాణ ప్రజల చేతుల్లోనే ఉన్నాయి!: రాహుల్ గాంధీకి కేటీఆర్ కౌంటర్
- కేసీఆర్ రిమోట్ మోదీ దగ్గర ఉందన్న రాహుల్
- రిమోట్ కంట్రోల్ ప్రధానులు, సీఎంలు కాంగ్రెస్ పేటెంట్ అని కేటీఆర్ ఎద్దేవా
- రాహుల్ వ్యాఖ్యలను దీటుగా తిప్పికొట్టిన టీఆర్ఎస్ నేత
కేటీఆర్ ఈరోజు ట్విట్టర్ లో స్పందిస్తూ..‘రాహుల్ గాంధీజీ.. ప్రధాన మంత్రులను, ముఖ్యమంత్రులను రిమోట్ కంట్రోల్ ద్వారా నియంత్రించడం కాంగ్రెస్ పార్టీకి ఉన్న పేటెంట్ హక్కు అని దేశమంతటికీ తెలుసు. మీరు, బీజేపీ రాష్ట్రాలపై ఎంతగా పెత్తనం చేయాలని భావించినప్పటికీ, మా భవిష్యత్తు, మా రిమోట్ కేవలం తెలంగాణ ప్రజల చేతుల్లోనే ఉన్నాయి’ అని ట్వీట్ చేశారు.