వర్మంటే నచ్చదుగానీ... ఈ సినిమా మాత్రం పక్కా హిట్: నాగబాబు జోస్యం
- వర్మ అంటే వ్యక్తిగతంగా గౌరవం లేదు
- డైరెక్టర్ గా సత్తాపై తప్పుగా మాట్లాడను
- సినిమాలో ఆసక్తికర అంశాలున్నాయనే అనుకుంటున్నా
డైరెక్టర్ గా ఎన్ని ఫెయిల్యూర్స్ తీసినా, అతనిలో ఉన్న ఎబిలిటీస్ మీద నేనెప్పుడూ తప్పుగా మాట్లాడను. 'లక్ష్మీస్ ఎన్టీఆర్'... దీనిపై నేను వ్యక్తిగతంగా చెబుతున్నా... రామారావు గారి జీవితంలో ఒడిదుడుకులు లేవండీ... హీ ఈజ్ ఆల్ వేస్ ఏ సక్సెస్ ఫుల్ హీరో. రాజకీయాల్లోకి వచ్చిన తరువాత కష్టాలు స్టార్ట్ అయ్యాయి. రామ్ గోపాల్ వర్మ తీసుకున్న పాయింట్ అక్కడి నుంచి కాబట్టి, కొంత ఇంట్రస్టింగ్ ఎలిమెంట్ దానిలో ఉంటుందని నా నమ్మకం. అందుకని అది బాగా ఉంటుందని అనుకుంటున్నా" అని అన్నారు. ఈ సినిమా పక్కాగా హిట్ అవుతుందని భావిస్తున్నట్టు తెలిపారు.