చుట్టుపక్కల గ్రామాలను కలిపేసుకోవచ్చు: తెలంగాణ కార్పొరేషన్ చట్ట సవరణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
- మునిసిపల్ కార్పొరేషన్ చట్టంలో సవరణలు
- వ్యతిరేకించి కోర్టుకెక్కిన గ్రామాలు
- 120కి పైగా పిటిషన్లను కొట్టేసిన ధర్మాసనం
ఈ పిటిషన్లను విచారించిన హైకోర్టు వాటిని కొట్టివేసింది. చీఫ్ జస్టిస్ టీబీ రాధాకృష్ణన్, జస్టిస్ ఎ.రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలోని హైకోర్టు బెంచ్ వాటిని కొట్టివేసింది. శాసన పరిధిలో ఇటువంటి సవరణలు చేసే అధికారం ప్రభుత్వానికి ఉందని ధర్మాసనం తేల్చి చెప్పింది. హైకోర్టు తీర్పుతో తెలంగాణ సర్కారుకు ఊరట లభించింది. దీంతో రాష్ట్రంలో మరిన్ని కొత్త పట్టణాల ఏర్పాటుకు మార్గం సుగమమైంది.