అల్లు అర్జున్ ను పెళ్లి చేసుకోవాలనుకునేదాన్ని: హీరోయిన్ నూరిన్ షరీష్
Add ap7am to your home Screen

అల్లు అర్జున్ ను పెళ్లి చేసుకోవాలనుకునేదాన్ని: హీరోయిన్ నూరిన్ షరీష్

  • అల్లు అర్జున్ సినిమాలు చూశాను
  •  ఆయన చీఫ్ గెస్టుగా రావడం అదృష్టం
  •  ఆయనకి నేను అభిమానిని
మలయాళంలో నిర్మితమైన 'ఒరు ఆదార్ లవ్' సినిమా, తెలుగులో 'లవర్స్ డే' పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో రోషన్ .. ప్రియా వారియర్ .. నూరిన్ షరీఫ్ ప్రధానమైన పాత్రలను పోషించారు. ఈ సినిమా టీమ్ హైదరాబాద్ లో సక్సెస్ మీట్ ను నిర్వహించింది.

తాజా ఇంటర్వ్యూలో నూరిన్ షరీఫ్ మాట్లాడుతూ .. "ఈ సినిమాకి ఈ స్థాయి రెస్పాన్స్ వస్తుందని నేను ఎంతమాత్రం ఊహించలేదు. నా పాత్రకి లభిస్తోన్న ఆదరణ నాకెంతో సంతోషాన్ని కలిగిస్తోంది. 'లవర్స్ డే' ఆడియో వేడుకకి అల్లు అర్జున్ చీఫ్ గెస్టుగా రావడం నాకెంతో ఆనందాన్ని కలిగించింది. మలయాళంలో విడుదలైన అల్లు అర్జున్ సినిమాలను నేను చూశాను. అప్పటి నుంచి నేను ఆయన అభిమానినయ్యాను. ఆయనను పెళ్లి చేసుకోవాలని కలలు కనేదాన్ని. ఆడియో రిలీజ్ రోజున అల్లు అర్జున్ తో మాట్లాడటం .. ఆయనతో కలిసి ఫొటో దిగడం నేను ఎప్పటికీ మరిచిపోలేను" అంటూ చెప్పుకొచ్చింది. 
roshan
priya
nurin

More Telugu News