వాయుసేన పైలట్లకు నా సెల్యూట్: రాహుల్ గాంధీ

  • లక్షిత దాడులు నిర్వహించిన ఐఏఎఫ్
  • ట్విట్టర్ లో అభినందనలు చెప్పిన రాహుల్
  • దేశవ్యాప్తంగా ప్రజల హర్షం
ఈ తెల్లవారుజామున పాక్ ఆక్రమిత కశ్మీర్ లోకి చొచ్చుకెళ్లి, ముజఫరాబాద్, బాలాకోట్ తదితర ప్రాంతాల్లో లక్షిత దాడులు నిర్వహించిన భారత వాయుసేన దళాలను కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అభినందించారు. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన "ఐఏఎఫ్ పైలట్లకు నా సెల్యూట్" అని వ్యాఖ్యానించారు. మోదీ సర్కారు నిర్వహించిన రెండో సర్జికల్ స్ట్రయిక్స్ పై దేశవ్యాప్తంగా ప్రజలు అభినందనలు తెలుపుతున్నారు.
Go Back to Shorts
Surgicle Strikes
IAF
Rahul Gandhi

More Telugu News