భారీ ఎత్తున బాంబులతో పీవోకే వైపు దూసుకెళ్లిన 12 మిరేజ్ ఫైటర్స్!

  • 2.40 గంటలకు విమానాలు టేకాఫ్
  • వందల కిలోల బరువున్న బాంబులతో పయనం
  • అతిపెద్ద ఉగ్రవాద శిబిరం ధ్వంసం
మంగళవారం అర్ధరాత్రి... సరిగ్గా 2.40 గంటల సమయం. అప్పటికే సిద్ధంగా ఉన్న భారత మిరేజ్ యుద్ధ విమానాల పైలట్లకు టేకాఫ్ తీసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ అందింది. వెంటనే 12 విమానాలు పాక్ ఆక్రమిత కాశ్మీర్ వైపు దూసుకెళ్లాయి. జైషే మహమ్మద్ ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా వందల కిలోల బరువున్న బాంబులను జారవిడిచాయి. ఈ దాడిలో పీఓకేలో ఉన్న అతిపెద్ద ఉగ్రవాద శిబిరం పూర్తిగా ధ్వంసం అయినట్టు ప్రాధమిక వార్తలను బట్టి తెలుస్తోంది. పుల్వామాలో జరిగిన ఆత్మాహుతి దాడిలో 43 మంది జవాన్లు అమరులు కావడంపై దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు పెల్లుబికిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ, స్వయంగా దాడులకు ఆదేశాలు ఇవ్వగా, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తో పాటు, నేవీ, ఆర్మీ తాజా దాడిని పర్యవేక్షించినట్టు తెలుస్తోంది. మరిన్ని అప్ డేట్స్ రావాల్సివుంది. 
Go Back to Shorts
POK
Surgicle Strikes
Mirrage
Fighter Jets

More Telugu News