'ప్రేమకథా చిత్రం 2' నుంచి యూత్ ను హత్తుకునే పాట
- సంగీత దర్శకుడిగా జీవన్ బాబు
- రమ్య బెహ్రా ఆలాపన
- త్వరలోనే ప్రేక్షకుల ముందుకు
"ఆకాశమంతా కొత్తగున్నదంటా ఇంకేదీ చూడనంతగా .. మారింది అంత పూర్తిగా, నా గుండెకింత వేగమెందుకంటా .. తనేదో చూసినందుకా .. మరింతగుంది వింతగా" అంటూ ఈ పాట సాగుతోంది. జీవన్ బాబు సంగీతం .. పూర్ణాచారి సాహిత్యం .. రమ్య బెహ్రా - మహ్మద్ హైమత్ ఆలాపన బాగున్నాయి. జీవన్ బాబు బాణీ చాలా బాగుంది .. యూత్ మనసులను కొల్లగొట్టే లక్షణాలు ఈ పాటకి పుష్కలంగా ఉన్నాయని చెప్పొచ్చు. గాయనీ గాయకులు ఇద్దరూ కూడా అద్భుతమైన ఫీల్ ను తమ స్వరంలో ఆవిష్కరించారు. మార్చి 21వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.