అరుదైన నాయకుడు, పోరాటయోధుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు!: తండ్రికి కేటీఆర్ బర్త్ డే విషెస్
- ప్రగతి భవన్ లో మొక్కలు నాటిన కేసీఆర్ ఫ్యామిలీ
- కేసీఆర్ నా తండ్రి కావడం గర్వకారణం
- ట్విట్టర్ లో స్పందించిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
తెలంగాణ ప్రగతి భవన్ లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ లో స్పందిస్తూ..‘కేసీఆర్ గారు ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలని కోరుతూ మా కుటుంబంలో ఒక్కొక్కరం ఒక్కో మొక్కను నాటాం.అరుదైన నాయకుడు, ధైర్యం, నిబద్ధత కలిగిన పోరాట యోధుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఆయన నా తండ్రి కావడం గర్వకారణం’ అని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ప్రగతి భవన్ లో మొక్కలు నాటుతున్న ఫొటోలను పోస్ట్ చేశారు.