ఆయనలో ద్వేషం ఉంది.. దానికి నా ప్రేమతో బదులిచ్చా: రాహుల్ గాంధీ

  • కాంగ్రెస్ ను మోదీ అవమానిస్తున్నారు
  • అయినా పార్లమెంటులో ఆయనను ఆలింగనం చేసుకున్నా
  • ప్రేమతోనే ద్వేషాన్ని ఎదుర్కోగలం
ప్రధాని మోదీలో ఉన్న ద్వేషాన్ని తనలోని ప్రేమతో ఎదుర్కొంటానని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అన్నారు. అజ్మీర్ లో జరిగిన ఓ ర్యాలీలో రాహుల్ ప్రసంగిస్తూ... కాంగ్రెస్ పార్టీని మోదీ అవమానిస్తున్నారని... అయినప్పటికీ పార్లమెంటులో మోదీని తాను ఆలింగనం చేసుకున్నానని చెప్పారు. ప్రేమతోనే ద్వేషాన్ని ఎదుర్కోగలమని అన్నారు. రాజస్థాన్ లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల రుణాలను మాఫీ చేసిందని చెప్పారు. రైతు రుణమాఫీపై మోదీ చేసింది ఉత్తుత్తి వాగ్దానాలు మాత్రమేనని అన్నారు. సన్నిహితులైన పారిశ్రామికవేత్తలకు మాత్రమే బ్యాంకు రుణాలను మోదీ రద్దు చేశారని ఎద్దేవా చేశారు. 
Go Back to Shorts
modi
Rahul Gandhi
bjp
congress

More Telugu News