తెలంగాణలో రెచ్చిపోయిన భజరంగ్ దళ్ కార్యకర్తలు.. ప్రేమ జంటకు పార్కులోనే పెళ్లి!
- మేడ్చల్ జిల్లా కండ్లకోయలో ఘటన
- పార్కులోనే తాళి కట్టించిన కార్యకర్తలు
- సోషల్ మీడియాలో వీడియో చక్కర్లు
పార్కులో తచ్చాడుతున్న ప్రేమ జంటను చుట్టుముట్టిన సభ్యులు అబ్బాయి చేత యువతికి తాళి కట్టించారు. ఈరోజు చాలా మంచిదనీ, ఆమెకు తాళి కట్టాలని సూచించారు. దీంతో సదరు యువకుడు బిక్కుబిక్కుమంటూ అమ్మాయి మెడలో తాళి కట్టేశాడు.
ఈ తతంగాన్ని భజరంగ్ దళ్ సభ్యులు వీడియో షూట్ చేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరోవైపు ఈరోజు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా పార్కుల వద్ద పోలీసులు గట్టి భద్రతను ఏర్పాటు చేశారు.