వాళ్లను హనీమూన్ పూర్తి చేసుకుని రానివ్వండి.. అప్పుడే నేనేం చెప్పినా వింటారు: కార్తి
Add ap7am to your home Screen

వాళ్లను హనీమూన్ పూర్తి చేసుకుని రానివ్వండి.. అప్పుడే నేనేం చెప్పినా వింటారు: కార్తి

  • పెళ్లికి సిద్ధమవుతున్న విశాల్
  • ఆర్య, సాయేషాల పెళ్లి మార్చిలో అని ప్రచారం
  • విశాల్, ఆర్య పెళ్లిపై ఫన్నీగా స్పందించిన కార్తి
తమిళ్ సినీ ఇండస్ట్రీలో ముఖ్యంగా రెండు జంటల పేర్లు బాగా వినిపిస్తున్నాయి. వాళ్లే విశాల్, అనీశా జంట, ఆర్య, సాయేషా సైగల్‌ల జంట. విశాల్ పెళ్లికి సిద్ధమవుతున్నాడని తెలిసిందే. ఆర్య, సాయేషా కూడా మార్చిలో పెళ్లికి సిద్ధమవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. కార్తి కథానాయకుడిగా నటించిన చిత్రం ‘దేవ్’ ఈనెల 14న విడుదల కాబోతోంది.

ఈ సందర్భంగా చిత్ర ప్రచారంలో భాగంగా మీడియాతో ముచ్చటించిన కార్తి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా కార్తిని మీడియా.. ‘విశాల్‌, ఆర్య పెళ్లి చేసుకోబోతున్నారు కదా.. మీరు వారికి ఏదైనా సలహా ఇస్తారా?’ అని ప్రశ్నించగా.. చాలా ఫన్నీగా సమాధానమిచ్చాడు. ‘ముందు వాళ్లను హనీమూన్ పూర్తి చేసుకుని రానివ్వండి. అప్పుడేగా నేనేం చెప్పినా వారు వినేది’ అని సరదాగా తెలిపాడు కార్తి.
Vishal
Aneesha
Arya
Karthi
Sayesh Syegal
Dev Movie

More Telugu News