స్నేహితుడితో కలసి కారులో వెళుతున్న యువతిని బయటికి లాగి.. సామూహిక అత్యాచారం

  • కారులో వెళుతున్న జంటను వెంటాడిన యువకులు
  • వాహనాన్ని ఆపి రాళ్లు, ఇటుకలతో దాడి
  • కాల్వ ఒడ్డుకు తీసుకెళ్లి యువతిపై సామూహిక అత్యాచారం
కారులో వెళుతున్న యువతిని బయటకు లాగి పదిమంది యువకులు అత్యాచారానికి పాల్పడిన ఘటన పంజాబ్‌లోని లుధియానాలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. 21 ఏళ్ల యువతి తన స్నేహితుడితో కలిసి శనివారం రాత్రి లుధియానా నుంచి కారులో ఐజేవాల్ గ్రామానికి బయలుదేరింది.

వారిని గమనించిన పదిమంది యువకులు మూడు ద్విచక్ర వాహనాలపై వెంబడించారు. పెద్దగా అరుస్తూ వారిని భయభ్రాంతులకు గురిచేశారు. కారు జాగ్రోన్ వద్దకు చేరుకోగానే కారుకు అడ్డంపడ్డారు. కారు ఆగగానే రాళ్లు, ఇటుకలతో దానిపై దాడిచేశారు. అనంతరం కారులోని యువతీ యువకులను బయటకు లాగి సిద్వాన్ కాలువ ఒడ్డుకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి తమ స్నేహితులు మరో ఆరేడుగురిని  ఫోన్ చేసి పిలిపించారు. అందరూ కలిసి యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం దుండగులు పరారయ్యారు.  

ఘటన అనంతరం బాధితులు ఇద్దరూ ఆదివారం వరకు అక్కడే ఉన్నారని ఎస్పీ తరుణ్ రత్తన్ తెలిపారు. బాధితురాలిని పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించామని, ఆమెపై సామూహిక అత్యాచారం జరిగినట్టు నివేదికలో వెల్లడైందని పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం వేట ప్రారంభించినట్టు ఎస్పీ తెలిపారు.
Go Back to Shorts
Woman
Punjab
Ludhiana
rape
drag
Crime News

More Telugu News